అల్లు శిరీష్ ABCD ట్రైలర్..!

April 15, 2019


img

ఒక్క క్షణం తర్వాత అల్లు శిరీష్ చేస్తున్న సినిమా ఏబిసిడి. సంజీవ్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. అమెరికన్ బార్న్ కన్ ఫ్యూజెడ్ దేశీ గా అల్లు శిరీష్ ఈ సినిమాలో కామెడీతో అలరించడానికి సిద్ధమయ్యాడు. ట్రైలర్ లో కూడా అమెరికాలో ఓ పెద్ద బిజినెస్ మెన్ కొడుకైన హీరో అనుకోకుండా ఇండియా రావడం అక్కడ ఓ అమ్మాయిని ఇష్టపడటం జరుగుతుంది. 

ఇక ఇంతలోనే హీరో పొలిటికల్ చక్రంలో ఇరుక్కుంటాడు. ఇంతకీ హీరోకి రాజకీయాలకు సంబంధం ఏంటి.. హీరోయిన్ కోసమే హీరో ఇండియాకు వచ్చాడా ఇలాంటి వాటికన్నిటికి సమాధానం సినిమాలో దొరుకుతుంది. సినిమాలో శిరీష్ స్నేహితుడిగా భరత్ నటించాడు. అల్లు శిరీష్ కు జోడీగా రుక్షర్ హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణార్జున యుద్ధం తర్వాత రుక్షర్ చేస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ ప్లాన్ చేశారు. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను మధురా శ్రీధర్, యశ్ రంగినేని నిర్మిస్తున్నారు. జుధా శాంటి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.  

Related Post

సినిమా స‌మీక్ష