బన్ని త్రివిక్రం సినిమాలో అక్కినేని హీరో..!

April 13, 2019


img

నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం డైరక్షన్ లో మూవీ షురూ చేశాడు. శనివారం ఆ సినిమాకు ముహుర్త కార్యక్రమాలు జరిగాయి. ఏప్రిల్ 24 నుండి సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్తుందట. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రం, బన్ని కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో అక్కినేని హీరో నటిస్తున్నాడని తెలుస్తుంది.        

అక్కినేని ఫ్యామిలీ హీరో నాగార్జున మేనళ్లుడు సుశాంత్ బన్ని సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడట. దశాబ్ధ కాలంగా హీరోగా చేస్తున్నా సుశాంత్ కు ఓ ఇమేజ్ రాలేదు. అయినా సరే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన చిలసౌ సుశాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం బన్ని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సుశాంత్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. బన్ని, సుశాంత్ వెరైటీ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష