బాహుబలిని మించే సినిమా తీస్తుందట

April 13, 2019


img

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ తో వార్తల్లో ఉంటుంది. ఈమధ్య అలియా భట్ పై హాట్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏ.ఎల్ విజయ్ డైరక్షన్ లో జయలలిత బయోపిక్ గా వస్తున్న తలైవి సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్ మణికర్ణికతో డైరక్షన్ లో వచ్చిన అనుభవంతో మరో భారీ సినిమా చేయాలని చూస్తుందట.   

ఇప్పటికే ఆ కథ లాక్ చేసినట్టు వెళ్లడించిన కంగనా ఆ సినిమా బాహుబలి, పద్మావతి తరహాలో భారీ బడ్జెట్ తో చారిత్రక కథతో వస్తుందని చెప్పింది. కబడ్డీ క్రాడా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఏదో క్రిష్ మొదలు పెట్టిన మణికర్ణిక పూర్తి చేసినంత మాత్రానా రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలిల రేంజ్ లో కంగనా డైరక్షన్ చేయగలదా అన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.Related Post

సినిమా స‌మీక్ష