ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్ కూడా..!

April 13, 2019


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి ఏ చిన్న న్యూస్ వచ్చినా అవి వైరల్ అవుతుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ కనిపించనున్నారు. వీరిద్దరితో పాటుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా ఆర్.ఆర్.ఆర్ లో ఉన్నాడని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉంటాడని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ తో రాజమౌళి తీసిన బాహుబలి సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ కూడా సెట్స్ మీద ఉంది. ఈ రెండిటితో పాటుగా ఆర్.ఆర్.ఆర్ లో కూడా ప్రభాస్ భాగస్వామ్యం అవుతున్నాడట.   

ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్ ఉండటం నిజమే కాని అది కనిపించేలా కాదు వినిపించేలా ఉంటుందట. అంటే ఆర్.ఆర్.ఆర్ కోసం ప్రభాస్ వాయిస్ ఓవర్స్ ఇస్తాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుందట. మొత్తానికి రాజమౌళి బాహుబలి క్రేజ్ ను ఆర్.ఆర్.ఆర్ కు వాడేయాలని డిసైడ్ అయ్యారని చెప్పొచ్చు.

 


Related Post

సినిమా స‌మీక్ష