సైరా టీంకు సీరియస్ వార్నింగ్

April 10, 2019


img

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ లేటు అవుతుండడంతో రాం చరణ్ చాలా అప్సెట్ లో ఉన్నాడట. ఇప్పటికే డైరక్టర్ సురేందర్ రెడ్డికి చాలాసార్లు చెప్పాడట.   

చిత్రయూనిట్ అందరికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఫైనల్ డేట్ ఫిక్స్ చేశాడట. ఆ డేట్ కల్లా సినిమా పూర్తి చేయాలని గట్టిగా చెప్పాడట. నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అసలైతే ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన సైరా సినిమా ఇప్పుడు దసరాకి వస్తుందని అంటున్నారు. మరి దసరా కల్లా అయినా సినిమా పూర్తవుతుందో లేదో చూడాలి.        Related Post

సినిమా స‌మీక్ష