నేను గల్లీ బోయ్ కాదు..!

April 10, 2019


img

బాలీవుడ్ లో ఈమధ్య వచ్చిన గల్లీ బోయ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కొన్నారని తెలుస్తుంది. సుప్రీం హీరో సాయి ధరం తేజ్ హీరోగా గల్లీ బోయ్ తెలుగు రీమేక్ ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా ఇప్పటివరకు తాను చూడలేదని.. తన దగ్గరకు అలాంటి డిస్కషన్ రాలేదని అంటున్నాడు సాయి ధరం తేజ్.

ప్రస్తుతం సాయి తేజ్ చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రలహరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయి తేజ్ చిత్రలహరి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా అయినా సాయి తేజ్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష