అర్జున్ సురవరం వాయిదా పడిందే

March 23, 2019


img

నిఖిల్ హీరోగా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కణితన్ మూవీ రీమేక్ గా వస్తున్న సినిమా అర్జున్ సురవరం. మాత్రుక దర్శకుడు టి.ఎన్. సంతోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 29న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. వచ్చే శుక్రవారం రిలీజ్ అనుకున్న ఈ సినిమా మే 1కి వాయిదా వేశారట. ప్రస్తుతం ఎన్నికల సీజన్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా కొంత జరగాల్సి ఉందట. అందుకే సినిమా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ ర్లీజ్ బిజినెస్ కూడా బాగానే చేస్తుందట. నైజాం మొత్తం ఏషియన్ సునీల్ నారంగ్ 4 కోట్లకు కొనేశారట. మిగతా ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ చేస్తుందట. లాస్ట్ ఇయర్ కిరాక్ పార్టీ తర్వాత నిఖిల్ చేస్తున్న ఈ సినిమాతో అతను హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.  Related Post

సినిమా స‌మీక్ష