మెగా హీరో పేరు మార్చుకున్నాడు..!

March 20, 2019


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తన పేరుని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ ఆ సినిమా నుండి మొదటి సింగిల్ పరుగు పరుగు సాంగ్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ క్యాచీగా ఉంది. ఇక ఈ సాంగ్ లో సాయి ధరం తేజ్ కు బదులు సాయి తేజ్ అని పెట్టారు.   

తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులు అందుకున్న సాయి ధరం తేజ్ ఈసారి సాయి తేజ్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రలహరి సినిమాలో నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నిజంగానే సాయి తేజ్ ను హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందో లేదో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష