బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున..!

March 19, 2019


img

బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా ఎన్.టి.ఆర్ దాదాపు ఓకే చెప్పాడని వార్తలు రాగా ఆర్.ఆర్.ఆర్ టైంలో బిగ్ బాస్ కు టైం కేటాయించడం కుదరదు అన్నది లేటెస్ట్ న్యూస్. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా ఎన్.టి.ఆర్, సీజన్ 2కి నాని హోస్ట్ గా చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కి రంగం సిద్ధమవుతుంది. అయితే హోస్ట్ గా తారక్ కష్టమే అని తెలుసుకున్న స్టార్ మా నాగార్జునని లైన్ లోకి తెస్తున్నారట.

బిగ్ బాస్ సీజన్ 3 నాగ్ హోస్ట్ గా పనిచేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ స్టార్ మాలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసి సూపర్ హిట్ కొట్టిన నాగార్జున ఆ ఉత్సాహంతో బిగ్ బాస్ కు సై అని చెప్పాడని తెలుస్తుంది. ఎం.ఈ.కే రెండు సీజన్స్ కు నాగ్ అద్భుతంగా హోస్టింగ్ చేశాడు. అందుకే ఎలాగు బుల్లితెర మీద అనుభవం ఉన్న నాగ్ కు బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలను అప్పగిస్తున్నారట . మరి బిగ్ బాస్ సీజన్ 3 అనుకున్నట్టుగా నాగ్ హోస్ట్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష