మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్..!

March 11, 2019


img

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి సెట్స్ మీద ఉంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 200 కోట్ల భారీ బడ్జెట్ తో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి కాగా త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నయనతార, తమన్నా నటిస్తున్నారని తెలుస్తుంది.

అయితే సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఆ పాత్రలో శృతి హాసన్ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయిన ఈ పాత్రకు శృతి హాసన్ ను అనుకున్నారట. అయితే ఆమె ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి హాసన్ మెగాస్టార్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. మెగాస్టార్ 152వ సినిమాలో శృతి హాసన్ ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష