బన్ని సినిమాలో నగ్మా..!

February 19, 2019


img

నా పేరు సూర్య సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రంతో సినిమా షురూ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతుంది. ఇక ఈ సినిమాలో కియరా అద్వాని, కీర్తి సురేష్ లను హీరోయిన్స్ గా అనుకోగా ఫైనల్ గా డిజే భామ పూజా హెగ్దె సెలెక్ట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో ఒకప్పటి హాట్ హీరోయిన్ నగ్మా కూడా నటిస్తుందని తెలుస్తుంది. బన్ని తల్లి పాత్రలో నగ్మాను సెలెక్ట్ చేశారట. తన సినిమాల్లో ఇలాంటి స్పెషల్ రోల్స్ కోసం ఒకప్పటి స్టార్స్ ను వాడటం త్రివిక్రం కు అలవాటే అత్తారింటికి దారేది సినిమాలో నదియాకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో నగ్మా నటిస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు స్టార్స్ అందరితో నటించిన నగ్మా 2002లో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మళ్లీ 17 ఏళ్ల తర్వాత సినిమాలు చేస్తుండటం విశేషం. మరి నగ్మా ఈ రీ ఎంట్రీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష