నిహారికతో సుకుమార్ మూవీ..?

February 15, 2019


img

మెగా డాటర్ నిహారిక సుకుమార్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. సుకుమార్ అసిస్టెంట్ ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట అది నిహారికకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని తెలిసి ఆమెకు వినిపించారట. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్ కూడా సహ నిర్మాతలుగా ఉంటున్నాయని తెలుస్తుంది.

మొత్తానికి సుకుమార్ ఓ పక్క దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా మంచి సినిమాలు చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న అసిస్టెంట్ టాలెంట్ గుర్తుస్తూ సుకుమార్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. ఫ్యూచర్ లో సుకుమార్ రైటింగ్స్ అనేది ఓ బ్రాండ్ గా మారి ఆ బ్యానర్ నుండి ప్రయోగాత్మక సినిమాలు వస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతం సుకుమార్ మహేష్ కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష