ప్రభాస్ బాహుబలి చేయడానికి అసలు కారణం ఇదే..!

February 15, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ గా మారాడు. బాహుబలి ముందు వరకు ప్రభాస్ అంటే తెలుగు హీరో మాత్రమే కాని ఆఫ్టర్ బాహుబలి ప్రపంచానికి పరిచయం అయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ కనివిని ఎరుగని రికార్డులను సృష్టించింది. ఈ సినిమా కథ రాజమౌళి చెప్పగానే ప్రభాస్ వెంటనే ఓకే చెప్పాడట. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు అతన్ని సినిమాల్లో రాజు పాత్రలో చూడాలని అనుకున్నారట.

అందుకే రాజమౌళి బాహుబలి సినిమా కథ చెప్పగానే అసలేమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాడట ప్రభాస్. అయితే ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా సూర్య నారాయణ రాజు గారు చూడకుండానే మరణించారు. 2010 ఫిబ్రవరి 12న సూర్య నారాయణ రాజు గారు మరణించడం జరిగింది. కేవలం తండ్రి కోరిక మేరకే బాహుబలి సినిమా చేసి సంచలన విజయం అందుకున్నాడు ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవనుంది.     



Related Post

సినిమా స‌మీక్ష