డియర్ కామ్రేడ్ రిపేర్లు ఉన్నాయా..!

February 14, 2019


img

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా ఫైనల్ రష్ లో కొన్ని అవసరమైన సీన్స్ నచ్చకపోవడంతో హీరో విజయ్ మళ్లీ రీ షూట్స్ చేద్దామని అంటున్నాడట. నూతన దర్శకుడు కాబట్టి విజయ్ మాటను కాదనలేక సరే అన్నారట.

నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కూడా రీ షూట్స్ కు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ రిపేర్లు సినిమా మీద ఏమేరకు ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి. టాక్సీవాలా హిట్ తో మళ్లీ తన సత్తా ఏంటో చూపించిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాను హిట్ ఖాతాలో నిలిచేలా చేసుకుంటాడో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష