లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్..!

February 14, 2019


img

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ట్రైలర్ రిలీజైంది. కొద్ది నిమిషాల క్రితం రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అప్పుడే సంచలనాలు సృష్టిస్తుంది. వర్మ ముందునుండి చెబుతున్నట్టుగానే ఎన్.టి.ఆర్ చివరి రోజుల్లో ఎంత మానసిక క్షోభని అనుభవించారో చూపించారు. ముఖ్యంగా వాడిని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పడం ఆ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పాడో ఆలోచించాల్సిన అవసరం లేదు.

సిని స్టార్ గా.. రాజకీయ నాయకుడిగా ఓ చరిత్ర సృష్టించిన ఎన్.టి.ఆర్. ఆయన జీవిత చరమాంకంలో చాలా బాధలు పడ్డారు. అందుకే ఎన్.టి.ఆర్ అసలు కథ అంటూ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్నాడు వర్మ. చెప్పినట్టుగా చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయని ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో సరికొత్త సంచలనం సృష్టించాడని చెప్పొచ్చు. ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.    





Related Post

సినిమా స‌మీక్ష