పెళ్లి వద్దంటున్న సాయి పల్లవి..!

February 12, 2019


img

మళయాళ సినిమా ప్రేమంతో సౌత్ ఆడియెన్స్ ను తన బుట్టలో వేసుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా, ఎం.సి.ఏ సినిమాలతో హిట్ అందుకున్న అయితే రీసెంట్ గా వచ్చిన పడి పడి లేచే మనసు అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి పెళ్లి చేసుకోనని చెబుతుంది. పెళ్లి ఇప్పుడు వద్దంటుందా లేక అసలకే వద్దా అంటే జీవితం మొత్తం బ్యాచిలర్ గానే ఉండాలని అనుకుంటుందట.

అసలు సాయి పల్లవి ఈ నిర్ణయానికి కారణం తన తల్లి దండ్రులని తెలుస్తుంది. పెళ్లైతే వారిని సరిగా చూసుకోవడం కుదరదని పెళ్లి వద్దు గిల్లి వద్దు అంటుంది. ప్రస్తుతం తన ఫ్యామిలీ చాలా సంతోషం గా ఉందని పెళ్లైతే వచ్చే అతను తన ఫ్యామిలీని సరిగా చూస్తాడో లేదో అంటుంది సాయి పల్లవి. అయితే ఇప్పుడు అలా అంటుంది కాని తల్లిదండ్రులను ప్రేమిస్తూ కాబోయే అత్తామామలను కూడా ప్రేమించే అబ్బాయి దొరికితే సాయి పల్లవి వెంటనే పెళ్లికి రెడీ అవుతుంది. పేరెంట్స్ మీద ప్రేమ ఉండటం బాగానే ఉంది కాని ఇలా ఒంటరిగా ఉండి పోవాలని అనుకోవడం మాత్రం సబబు కాదు. ఈ విషయం ఆమెకు అర్ధమయ్యేలా ఎవరు చెబుతారో మరి.  Related Post

సినిమా స‌మీక్ష