'RRR' రాం చరణ్ పేరు అదేనా..!

February 12, 2019


img

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందునుండి ఇదొక పిరియాడికల్ మూవీ అని.. చరణ్ పోలీస్ పాత్రలో.. ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే లీకైన పిక్స్ వీటికి మరింత నమ్మేలా చేస్తున్నాయి. 

రీసెంట్ గా బ్రిటీష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ సెట్ లీక్ అవడంతో చరణ్ ఇందులో పోలీస్ గా కనిపిస్తాడని ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో రాం చరణ్ క్యారక్టర్ నేమ్ కూడా లీక్ అయ్యింది. రామరాజు పాత్రలో చరణ్ పవర్ పోలీస్ గా కనిపిస్తాడట. బ్రిటీష్ ప్రభుత్వంలోనే డ్యూటీ చేస్తున్నా నర నరాన దేశభక్తి ఉన్న పాత్రలో చరణ్ కనిపిస్తాడట. సో ఆర్.ఆర్.ఆర్ లో ఒక ఆర్ కు మీనింగ్ తెలిసింది. అన్నట్టు మొన్నామధ్య ఈ సినిమా టైటిల్ కూడా రామ రావణ రాజ్యం అని పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. రాముడు రాం చరణ్ రావణుడు ఎన్.టి.ఆర్ సో ఇదే టైటిల్ పెట్టినా పెట్టొచ్చని అంటున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష