దర్శక నిర్మాత విజయ బాపినీడు ఇకలేరు..!

February 12, 2019


img

ప్రముఖ తెలుగు దర్శకుడు విజయ బాపినీడు మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ బాపినీడు ఈరోజు ఉదయం అనంతలోకాలకు వెళ్లారు. దర్శకుడిగా.. నిర్మాతగా తెలుగు పరిశ్రమకు ఎన్నో మంచి చిత్రాలను అందించారు విజయ బాపినీడు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1932 సెప్టెంబర్ 22 ఏలూరు దగ్గరలో ఉన్న చాటపర్రులో ఆయన జన్మించారు. 

1976లో యవ్వనం కాటేసింది సినిమా ద్వారా నిర్మాతగా మారిన విజయ బాపినీడు 1981లో డబ్బు డబ్బు డబ్బు సినిమాతో దర్శకుడిగా కొత్త టర్న్ తీసుకున్నారు. దర్శకుడిగా 20కి పైగా సినిమాలు చేసిన ఆయన శోభన్ బాబు, చిరంజీవిలతో ఎక్కువ సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిన ఖైది నెం.786, గ్యాంగ్ లీడర్, మగ మహారాజు, హీరో సినిమాలు విజయ బాపినీడు డైరక్షన్ లో తెరకెక్కాయి. విజయ బాపినీడు మరణ వార్త విని సిని పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. సిని ప్రముఖులు విజయ బాపినీడు కుటుంబానికి తమ సానుభూతిని తెలుపుతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష