న్యూ లుక్ అనుష్క.. ఫ్యాన్స్ హ్యాపీ..!

February 11, 2019


img

స్వీటీ అనుష్క సైజ్ జీరో కోసం లావుగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం అంతగా రిస్క్ తీసుకున్నా అది కాస్త తుస్సుమంది. ఆ తర్వాత అమ్మడు ఎంత ప్రయనించినా సరే సన్నబడలేదు. బాహుబలి, సింగం-3, భాగమతి కొన్ని ఎపిసోడ్స్ లో అనుష్క లావుగానే కనిపించింది. ఇలానే ఉంటే ఆఫర్స్ కూడా కష్టమని భావించిన అనుష్క ఆస్ట్రియాలో నాచురల్ థెరపీ తీసుకుంది.


లేటెస్ట్ గా అనుష్క తన సన్నబడిన పిక్ బయటకు వచ్చింది. వైత్ అండ్ వైట్ లో సముద్ర తీరంలో అనుష్క మళ్లీ మునుపటి రూపంతో కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ట్రై చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయిన ఈ పిక్ చూసి అనుష్క ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం అనుష్క మాధవన్ తో కలిసి సీక్రెట్ అనే సినిమాలో నటిస్తుంది. నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కోనా వెంకట్ నిర్మిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష