యూట్యూబ్ లో సాయి పల్లవి హంగామా..!

February 09, 2019


img

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా అంతకుముందు మళయాళం ప్రేమం తో అందరిని తన ప్రేమలో పడేసుకుంది సాయి పల్లవి. తెలుగులో ఫిదా సూపర్ హిట్ కొట్టగా ఆ తర్వాత ఎం.సి.ఏ అలా ఆఫర్లు మొదలయ్యాయి. రీసెంట్ గా శర్వానంద్ తో తీసిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాతో పాటుగా తమిళంలో మారి 2 కూడా చేసింది సాయి పల్లవి. మారి 2 తమిళంలో యావరేజ్ గా ఆడింది. తెలుగు వర్షన్ పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇదిలాఉంటే మారి 2లోని రౌడీ బేబీ సాంగ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. సాంగ్ రిలీజైన నెల రోజుల్లోనే 183 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే 18.3 కోట్ల వ్యూస్ అన్నమాట. సౌత్ లోనే కాదు ఇండియాలోనే ఈ రేంజ్ వ్యూస్ సాధించిన సాంగ్ మరోటి లేదు. సాయి పల్లవి నటించిన ఫిదా లోని వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే సాంగ్ కూడా యూట్యూబ్ ను షేక్ చేసింది. ఆ పాట 2017లో యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఇప్పటికి 182 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే ఇది కూడా 18 కోట్ల పైగా వ్యూస్ తెచ్చుకుంది. 

సాయి పల్లవితో సినిమా అంటే సినిమా ఫలితాలు ఎలా ఉన్నా యూట్యూబ్ రికార్డులు మాత్రం అదరగొడుతున్నాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి కాస్త ఊపున్న పాత్ర పడితే మాత్రం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో సాయి పల్లవి ఇలాంటి సంచలనాలు ఇంకెన్ని సృష్టిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష