అఖిల్ 'మిస్టర్ మజ్ను' ట్రైలర్.. మరో కొత్త లవ్ స్టోరీ..!

January 19, 2019


img

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ ను. ఎస్.వి.సి.సి క్రియేషన్స్ లో బోగవల్లి ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. జనవరి 25న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరిగింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా రాగా మిస్టర్ మజ్నుకి తన బెస్ట్ విషెస్ అందించారు ఎన్.టి.ఆర్.

ఇక ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ప్లే బోయ్ అయిన హీరో ఓ అమ్మాయి ప్రేమ వల్ల ఎలా మారిపోయాడు అన్నది మిస్టర్ మజ్ను కథ. కేవలం రోజుల మీద రిలేషన్స్ నడిపే హీరోకి హీరోయిన్ అతనితో జీవితాంతం ప్రేమ కావాలని కోరుకుంటుంది. మరి అలాంటప్పుడు ఈ మిస్టర్ ఏం చేశాడు. అతను ఎలా మజ్నుగా మారాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమాతో పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడు అఖిల్. 

Related Post

సినిమా స‌మీక్ష