రీమేక్ కు నో చెప్పిన వరుణ్

January 18, 2019


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంతరిక్షం నిరాశపరచినా సంక్రాంతికి వచ్చిన ఎఫ్-2 సూపర్ హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేష్ తో వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అన్లీ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే జిగుర్తండా రీమేక్ లో నటించాల్సి ఉన్న వరుణ్ తేజ్ చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకున్నాడని తెలుస్తుంది. జిగుర్తండా సినిమాలో విలన్ గా వరుణ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం కెరియర్ జోష్ గా ఉన్న ఇలాంటి టైంలో ప్రయోగాలు ఎందుకని వరుణ్ తేజ్ ఆ రీమేక్ ను పక్కన పెట్టేశాడట. దాని ప్లేస్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఓ సినిమా చేస్తున్నాడట. కిరణ్ కొర్రపాటి డెబ్యూ డైరక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబితో పాటుగా వరుణ్ తేజ్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నాడట.



Related Post

సినిమా స‌మీక్ష