ఎఫ్-2 రివ్యూ & రేటింగ్

January 12, 2019


img

రేటింగ్ : 2.75/5

కథ :

ఎం.ఎల్.ఏ దగ్గర పిఏగా పనిచేస్తున్న వెంకీ హారిక (తమన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. హారిక అండ్ ఫ్యామిలీ వెంకీని ఓ ఆటాడేసుకుంటారు. పెళ్లి.. పెళ్లాం మీద ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు వెంకీ. ఈ టైంలో హారిక సిస్టర్ హనీ (మెహ్రీన్ కౌర్) వరుణ్ ను ప్రేమిస్తుంది. వారిద్దరు వెంకీ కంట పడతారు. వెంకీ హనీ ఫ్యామిలీ గురించి వరుణ్ ను ముందస్తు జాగ్రత్తగా మందలిస్తాడు అయినా అతను హనీని పెళ్లాడటానికి ఫిక్స్ అవుతాడు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ కు హనీ ఫ్యామిలీ తాకిడి తెలుస్తుంది. ఫైనల్ గా కో బ్రదర్స్ ఇద్దరు హారిక, హనీలకు దూరంగా కొన్నాళ్లు ఉండాలని చూస్తారు. అందుకే యూరప్ వెళ్తారు. అక్కడ ఏం జరిగింది..? వెంకీ వరుణ్ లు మళ్లీ హారిక, హనీలకు ఎలా దగ్గరాయ్యారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఈ మూడు సినిమాలతో అనీల్ రావిపుడి తనకంటూ ఓ మార్క్ వేసుకున్నాడు. అదే కామెడీ మంత్రంతో ఎఫ్-2తో వచ్చాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ హైలెట్ గాఎఫ్2 వచ్చింది. అయితే కథలో పెద్దగా కొత్తదనం లేదని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కామెడీతో నడిపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కామెడీ అలరించింది.

సెకండ్ హాఫ్ యూరప్ లో పెద్దగా కామెడీ వర్క్ అవుట్ కాలేదు. సినిమా అంతా సరదాగా సాగుతుందని మాత్రం చెప్పొచ్చు. సంక్రాంతికి వచ్చిన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల మధ్య ఎఫ్-2 మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే సూపర్ హిట్ అనిపించుకునేది. 

కాస్ట్ మొత్తం బాగానే సపోర్ట్ చేసినా స్క్రిప్ట్ లో పెద్దగా దమ్ము లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. సినిమాలో వెంకటేష్ ఇదవరకు కామెడీ పంచులు బాగా అలరిస్తాయి. వరుణ్ తేజ్ కూడా మెప్పించాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎఫ్-2 ప్రేక్షకులను అలరిస్తుంది.

నటన, సాంకేతికవర్గం :

వెంకటేష్ ఫ్యాన్స్ కు ఎఫ్-2 ఫుల్ ఖుషి చేస్తుంది. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాల వెంకటేష్ మళ్లీ కనిపించాడు. వెంకటేష్ ఎనర్జీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. వరుణ్ తేజ్ రోల్ కూడా అలరించింది. అయితే సినిమాలో వరుణ్ పాత్ర మీద ఇంకాస్త వర్క్ చేయాల్సింది. హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ ఇద్దరు అలరించారు. ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి, అన్నపూర్ణ, వై విజయ, పృధ్వి రాజ్ ఇలా అందరు తమ పాత్రల్లో మెప్పించారు. వెన్నెల కిశోర్ చివర్లో కొద్దిసేపు కనిపించాడు. అనసూయ సాంగ్ ఓ సీన్ కు పరిమితమైంది.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. దేవి ఈమధ్య బాగా డిజప్పాయింట్ చేస్తున్నాడు. కథ, కథనాల్లో దర్శకుడు అనీల్ రావిపుడు తన మార్క్ చూపించలేకపోయాడు. రొటీన్ కథే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగుంది. సినిమాకు దిల్ రాజు పెద్దగా ఖర్చు పెట్టినట్టు లేదు. కాస్టింగ్ బాగున్నా తక్కువ లొకేషన్స్ లో సినిమా పూర్తి చేశాడు.

బాటం లైన్ :

ఎఫ్-2.. సంక్రాంతి సినిమానే.. కాని..!Related Post

సినిమా స‌మీక్ష