ఇండియన్ 2 కోసం కొరియన్ బ్యూటీ

January 11, 2019


img

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ ఇండియన్. రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఆ సినిమా సీక్వల్ గా ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు శంకర్. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఇండియన్ 2 సినిమాలో కాస్టింగ్ ఫైనల్ అయ్యింది. సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేస్తుండగా మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, శింభు నటిస్తున్నారని తెలుస్తుంది.

కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అవగా కొరియన్ బ్యూటీ బేయ్ సుజి మరో హీరోయిన్ గా నటిస్తుందట. కొరియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ అయిన బేయ్ సుజి చేస్తున్న మొదటి ఇండియన్ సినిమా ఇండియన్ 2. సినిమాలో ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుందట. హాలీవుడ్ మేకప్ మెన్ తో ఇండియన్ 2 సినిమాలో కమల్ కొత్త లుక్ ట్రై చేయిస్తున్నాడు శంకర్. 2.ఓ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అందుకే ఇండియన్ 2తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు శంకర్.Related Post

సినిమా స‌మీక్ష