ఇస్మార్ట్ శంకర్ అతని కథేనా..!

January 08, 2019


img

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలు పెంచేసింది. జగడం తర్వాత రామ్ నటిస్తున్న మాస్ మూవీ ఇదే అని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా సరైన హిట్ కొట్టని పూరి రామ్ ను బాగానే ఒప్పించాడు. అయితే రామ్ ఒప్పుకోడానికి మరో కారణం రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని తెలుస్తుంది.   

అదేంటి రామ్ ఇస్మార్ట్ శంకర్ కు విజయ్ దేవరకొండకు సంబంధం ఏంటి అంటే ముందు ఈ కథను పూరి విజయ్ దేవరకొండకే వినిపించాడట. కథ నచ్చినా ప్రస్తుతం రెండేళ్ల వరకు డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఆ సినిమా వదులుకున్నాడట విజయ్ దేవరకొండ. విజయ్ తో మరో కథ తీయొచ్చనే ఉద్దేశంతో పూరి రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మరి విజయ్ వదులుకున్న స్టోరీతో రామ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.    Related Post

సినిమా స‌మీక్ష