అవసరాలతో శర్వానంద్ సినిమా..!

January 08, 2019


img

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా దర్శకుడిగా కూడా తన సత్తా చాటుతున్న అవసరాల శ్రీనివాస్ జ్యో అచ్యుతానంద తర్వాత మరో సినిమా చేలేదు. నటుడిగా బిజీగా ఉన్నా సరే డైరక్టర్ గా సరైన కాంబినేషన్ సెట్ అవ్వట్లేదని టాక్. ఈమధ్యనే శర్వానంద్ కు సూటయ్యే మంచి కథ సిద్ధం చేశాడట అవసరాల శ్రీనివాస్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది.

అవసరాల శ్రీనివాస్ తో శర్వానంద్ సినిమా కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మంచి అంచనాలతో వస్తుంది. అయితే ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి అయ్యాక అవసరాల సినిమా మొదలుపెడతాడట. ఎలా లేదన్నా అవసరాలతో క్రిష్ సినిమా మరో మూడు నెలలు తర్వాతే అని తెలుస్తుంది. అప్పటివరకు అవసరాల శ్రీనివాస్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా రాసుకుంటాడని అంటున్నారు. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష