నాగబాబుకి రివర్స్ పంచ్..!

January 05, 2019


img

హీరోలుగా ఉన్నప్పుడు గొడవలెలా ఉన్నా రాజకీయాల్లోకి వచ్చాక అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పవన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన బాలకృష్ణని ఇన్ డైరెక్ట్ గా బాగానే వాయిస్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. మొదట్లో నాగబాబు కామెంట్స్ కు మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేశారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ పై మెగా బ్రదర్ ఓ కట్టు కథ.. కల్పిత కథ అంటూ ఓ కవిత్వం వేశాడు.

దీనిపై మెగా ఫ్యాన్స్ కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొదరు మాత్రం నెగటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ వెళ్తే మిగిలేది ఏమి ఉండదు. సమయం సందర్భం అంటూ ఉండాలిగా అంటూ రివర్స్ గా నాగబాబుకే పంచ్ వేస్తున్నారు మెగా ఫ్యాన్స్. పవన్ కు సపోర్ట్ గా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నా పొలిటికల్ స్టెప్ తీసుకోలేదు కాబట్టు నాగబాబు ఇంత లాగాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సినిమాల మధ్య పోటీగా ఉన్న మెగా నందమూరి వైరం పొలిటికల్ అట్మాస్పియర్ వేడెక్కేలా చేస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష