వైఎస్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

December 14, 2018


img

బయోపిక్ సినిమాల హవా కొనసాగుతున్న టాలీవుడ్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ తో పాటుగా దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాత్ర టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో వై.ఎస్.ఆర్ గా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న యాత్ర మూవీ 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

అసలైతే డిసెంబర్ 21న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఆ డేట్ కు రావట్లేదని తెలుస్తుంది. వై.ఎస్ అభిమానులను మెప్పించేలా సినిమా వస్తుందని అంటున్నారు. టీజర్ తో పాటుగా యాత్రలోని మొదటి పాట సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. 2019 ఫిబ్రవరి 8న యాత్ర రిలీజ్ ఫిక్స్ చేశారు.



నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు. కాని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వారు కొందరే ఉంటారు. అందులో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఒకరని చెప్పొచ్చు. ఫిబ్రవరి 8న ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల భాషల్లో రిలీజ్ అవనుంది.    



Related Post

సినిమా స‌మీక్ష