ఎన్టీఆర్ అంతా సీక్రెట్ గానే..!

December 13, 2018


img

రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నవంబర్ 11న సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించడం విశేషం. పిరియాడికల్ మూవీ గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. రాం చరణ్ ఇప్పటికే పోలీస్ పాత్ర చేస్తాడని తెలుస్తుంది. అయితే సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ పై రాజమౌళి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

ఇప్పటికే తారక్ తన ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో వర్క్ అవుట్స్ స్టార్ట్ చేశాడు. అయితే ఎన్.టి.ఆర్ లుక్ కు సంబందించి అంతా సీక్రెట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఎలాంటి పిక్స్ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. ఎన్.టి.ఆర్ టీం తో పాటుగా చిత్రయూనిట్ అందరికి రాజమౌళి ఆంక్షలు విధించాడని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో మొదలుకానుందని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష