క్లీన్ స్వీప్ చేసినందుకు కంగ్రాట్స్

December 12, 2018


img

తెలంగాణాలో 88 స్థానాల్లో టి.ఆర్.ఎస్ పార్టీ విజయభేరి మోగించింది. మహాకూటమికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పరచేలా కె.సి.ఆర్ నాయకత్వంలో టి.ఆర్.ఎస్ సత్తా చాటింది. ఇక టి.ఆర్.ఎస్ విజయాన్ని ప్రస్థావిస్తూ సెలబ్రిటీస్ ట్వీట్స్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. రిజల్ట్ తెలిసిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ కె.టి.ఆర్ కు ట్వీట్ చేశారు. బిగ్ కంగ్రాట్స్ కె.టి.ఆర్ గారు ఈ విజయానికి మీరు అర్హులు.. ప్రజల మనిషిగా పరిపాలన సాగించండని మహేష్ కె.టి.ఆర్ కు స్పెషల్ గా ట్వీట్ చేశారు.

ఇక రాం చరణ్ కూడా క్లీన్ స్వీప్ చేసినందుకు కంగ్రాట్స్. కె.సి.ఆర్, కె.టి.ఆర్, హరీష్ రావు, కవిత పార్టీ నేతలందరికి తన శుభాకాంక్షలు తెలిపాడు చరణ్. తెలంగాణాను గొప్ప స్థాయిలో నిలబెట్టేలా మీరు పనిచేయాలని ఈ కొత్త ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు చరణ్. మొత్తానికి టి.ఆర్.ఎస్ పార్టీ గెలుపుని టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం ఆహ్వానించడం మంచి విషయం.   



Related Post

సినిమా స‌మీక్ష