కథ పూర్తి కాకుండానే..!

December 11, 2018


img

రాజమౌళి డైరక్షన్ లో క్రేజీ మల్టీస్టార్ర్ గా వస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి ఇద్దరు స్టార్స్ నటిస్తుండటం విశేషం. నవంబర్ 11న సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్ జనవరి ఎండింగ్ లో కాని.. ఫిబ్రవరి మొదట్లో కాని ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీ ఫుల్ స్క్రిప్ట్ పూర్తి కాకుండానే సినిమా షూటింగ్ మొదలుపెట్టారట రాజమౌళి.

తన కెరియర్ లో ఎప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి కాకుండా సినిమా మొదలుపెట్టని రాజమౌళి ట్రిపుల్ ఆర్ కు ఇద్దరు హీరోల డేట్స్ కోసమని ముందుగా అనుకున్న సీన్స్ షూట్ చేస్తున్నారట. అయితే ఈ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో కూడా ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడటం లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ మూవీపై తారాస్థాయిలో అంచనాలున్నాయి.  Related Post

సినిమా స‌మీక్ష