యశ్ గురించి ఆరా తీసిన రాజమౌళి..!

December 10, 2018


img

బాహుబలి తర్వాత రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే తన స్నేహితుడు సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్న కె.జి.ఎఫ్ ప్రమోషన్ బాధ్యత మీద వేసుకున్నాడు రాజమౌళి. కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తున్న సినిమా కె.జి.ఎఫ్. కోలార్ బంగారు గనుల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా హీరో యశ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు రాజమౌళి. ఓ నాలుగైదేళ్ల క్రితం కన్నడలో పరిస్థితి గురించి ఆరా తీస్తే యశ్ అని కొత్త కుర్రాడు వరుస హిట్లు కొడుతున్నాడని చెప్పాడట. అప్పటి నుండి యశ్ గురించి తెలుసుకున్న జక్కన్న ఏప్రిల్ లో బెంగళూరు తాజ్ లో కె.జి.ఎఫ్ ప్రాజెక్ట్ విజువల్స్ చూశానని సినిమా ఒరిజినాలిటీ నచ్చిందని. తప్పకుండా పాన్ ఇండియా మూవీ అవుతుందని అందుకే ఇన్ని భాషల్లో రిలీజ్ అవుతుందని అన్నారు రాజమౌళి.  

ఇక యశ్ తండ్రి ఓ సాధారణ బస్ డ్రైవర్.. కొడుకు పెద్ద హీరో అయినా ఇప్పటికి ఆయన బస్ డ్రైవర్ గా చేస్తున్నాడు. ఈ బస్ డ్రైవరే నిన్ను స్టార్ చేశాడంటూ నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా అని చెప్పాడట. అందుకే యశ్ కన్నా అతని తండ్రి సూపర్ స్టార్ అన్నారు రాజమౌళి. 



Related Post

సినిమా స‌మీక్ష