నిక్ ను మోసం చేసి పెళ్లాడిన ప్రియాంకా..?

December 06, 2018


img

బాలీవుడ్ ప్రేమ జంట ప్రియాంకా, నిక్ జోనస్ ల మీద యూఎస్ మేగజైన్ విమర్శలు చేసింది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్, బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు ప్రమోట్ అయిన ప్రియాంకా చోప్రా ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. డిసెంబర్ 2న వీరు పెళ్లితో ఒకటయ్యారు. అయితే ప్రియాంకా నిక్ ను మోసం చేసి పెళ్లాడిందని ది కట్ మేగజైన్ తమ వెబ్ సైట్ లో రాసుకొచ్చింది. 

డేటింగ్ తో సరిపెట్టుకుందామనుకున్న నిక్ ను ఆమె బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుందని కథనంలో రాశారు. అయితే దీనిపై సెలబ్రిటీస్ నుండి విమర్శలు కూడా వెళ్లువెత్తుతున్నాయి. జాతి వివక్షత వల్లే ప్రియాంక మీద ఇలాంటి కథనాలు రాస్తున్నారని అంటున్నారు. నిక్ సోదరుడు జో జోనాస్ కూడా సదరు మేగజైన్ మీద మండిపడ్డారు. అందరు విమర్శిస్తుండటంతో ఆ వెబ్ సైట్ నుండి ఆర్టికల్ డిలీట్ చేశారు. Related Post

సినిమా స‌మీక్ష