సవ్యసాచి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!

October 23, 2018


img

అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ప్రయోగాత్మక సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక రిలీజైన రెండు సాంగ్స్ కూడా ఆడియెన్స్ ను అలరించగా సినిమా ట్రైలర్ అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.

నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుంది అన్న ఎక్సైట్మెంట్ అక్కినేని ఫ్యాన్స్ లో ఏర్పడింది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు మరి సవ్యసాచితో అయినా సత్తా చాటుతాడో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష