వినయ విధేయ చిరుకి నచ్చలేదా..!

October 19, 2018


img

బోయపాటి శ్రీను డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా మొదట్లో స్టేట్ రౌడీ, రౌడీ తమ్ముడు అంటూ ప్రచారం జరిగింది. కాని బోయపాటి శ్రీను మాత్రం వినయ విధేయ రామా అనే టైటిల్ కు ఫిక్స్ అయ్యాడని అన్నారు.

చరణ్ కూడా దర్శకుడు సజెస్ట్ చేసిన టైటిల్ కు కన్విన్స్ అయ్యాడట కాని మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆ టైటిల్ వద్దని అన్నాడట. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకు క్లాస్ టైటిల్ అచ్చుబాటు కాదని.. అది కూడా సినిమా కథకు సరిపోయేలా ఏదైనా మాస్ టైటిల్ పెట్టమని చెప్పాడట. చిరంజీవి కాదన్నాడు కాబట్టే వినయ విధేయ రామా టైటిల్ పోస్టర్ ఈ దసరాకు రిలీజ్ కాలేదట. అసలైతే దసరా కానుకగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని టైటిల్ పై క్లారిటీ రాకపోవడంతో అది కాస్త వాయిదా పడింది. దీపావళికి మాత్రం తప్పకుండా చరణ్ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష