అరవింద సమేత హంగామా మొదలైంది

October 10, 2018


img

ఎన్.టి.ఆర్, త్రివిక్రం ఊహలకు అందని ఈ కాంబినేషన్ లో 12 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న సినిమా చేయలేదు. ఫైనల్ గా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. తెల్లారితే సినిమా అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న అరవింద సమేత సినిమా కోసం అభిమానుల జోష్ మొదలైంది.

రెండు మూడుల రోజుల క్రితమే హాట్ కేకుల్లా ఆన్ లైన్ టికెట్స్ అమ్ముడవగా ప్రస్తుతం ఏపిలో స్పెషల్ షోస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ దసరాకి స్టార్ సినిమా అరవింద సమేత మాత్రమే. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం రికార్డులు క్రియేట్ చేసినట్టే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా తమన్ మ్యూజిక్ అందించాడు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా తారక్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష