శ్రీదేవిగా రకుల్ జస్ట్ ఓకే

October 10, 2018


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి మరో క్రేజీ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. సినిమాలో శ్రీదేవి పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని తెలిసిందే. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమాలో శ్రీదేవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందాల తార శ్రీదేవిగా నటించడం అంటే అది మాములు విషయం కాదు. అలాంటి పాత్రలో రకుల్ కుదిరినట్టే అనిపిస్తుంది ఫస్ట్ లుక్ చూస్తుంటే. అయితే రకుల్ ది గుండ్రటి ముఖం శ్రీదేవిది కాస్త కోల ముఖంగా ఉంటుంది. అదొక్కటే తప్ప మిగతా అంతా ఓకే.


ఇక అభినయంలో శ్రీదేవిని రకుల్ ఏమాత్రం మరిపిస్తుందో చూడాలి. ప్రస్తుతం కెరియర్ లో కాస్త వెనుకపడ్డట్టు కనిపిస్తున్న రకుల్ కు శ్రీదేవి రోల్ చాలెజింగ్ గా తీసుకుంటుందని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ, శ్రీదేవి గా రకుల్ ఆడిపాడనున్నారు. సినిమాలో ఆమె పాత్ర ఓ 10 నిమిషాల దాకా ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమాలో ఏయన్నార్ గా సుమంత్, హరికృష్ణగా కళ్యాణ్ రాం, చంద్రబాబు నాయుడిగా రానా నటిస్తున్నారని తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవుతుంది.  Related Post

సినిమా స‌మీక్ష