వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి..!

September 22, 2018


img

విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుందట. వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లికూతురు కాబోతుంది. తన స్నేహితుడితో ఆమె పెళ్లికి సిద్ధమైంది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకునేది ఎవరు అంటే హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడని తెలుస్తుంది. మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడైన రఘురామి రెడ్డి కొడుకుతో వెంకటేష్ కూతురు వివాహం నిశ్చర్యించారట.

కొన్నాళ్లుగా సాగుతున్న వీరి ప్రేమ పెద్దల అంగీకారం లభించడంతో పెళ్లి ద్వారా ఒకటి కానున్నారు. ఇప్పటికే అబ్బాయి తరపున వారితో సురేష్ బాబు వెళ్లి మాట్లాడటం జరిగిందట. ప్రస్తుతం ఎఫ్-2 షూటింగ్ లో ఫారిన్ లో ఉన్న వెంకటేష్ హైదరాబాద్ రాగానే ఈ విషయంపై అఫిషియల్ న్యూస్ బయటకు ప్రకటిస్తారని తెలుస్తుంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నారట. దగ్గుబాటి ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా ఉత్సాహపరచే వార్త అని చెప్పొచ్చు.    



Related Post

సినిమా స‌మీక్ష