ఆ సీక్వల్ లో తమన్నా..!

September 20, 2018


img

మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని అనిపిస్తుంది. అవకాశాలైతే వస్తున్నా వాటికి తగినట్టుగా ఫలితాలు మాత్రం అందుకోలేదు అమ్మడు. ప్రస్తుతం క్వీన్ రీమేక్ లో దటీజ్ మహాలక్ష్మి సినిమాతో పాటుగా వెంకటేష్, వరుణ్ తేజ్ చేస్తున్న ఎఫ్-2 సినిమాలో కూడా నటిస్తుంది తమన్నా.

ఇక వీటితో పాటుగా అభినేత్రి సీక్వల్ లో నటిస్తుంది తమన్నా. ఏ.ఎల్.విజయ్ డైరక్షన్ లో ప్రభుదేవ, సోనూ సూద్ నిర్మించిన అభినేత్రి మూవీ హిందిలో హిట్ అయినా తెలుగు, తమిళ భాషల్లో అంతగా ఆదరణ దక్కించుకోలేదు. అయినా సరే అభినేత్రి సీక్వల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారట. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రాబోతుంది. తమన్నా కచ్చితంగా ఈ సినిమాలతో మళ్లీ ఫాంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  Related Post

సినిమా స‌మీక్ష