మోహన్ బాబుకి మాతృ వియోగం

September 20, 2018


img

మంచు మోహన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ (85) ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. మోహన్ బాబు కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్నారు. తల్లి మరణం తెలిసిన వెంటనే ఫ్యామిలీ తిరుగు ప్రయాణం పట్టారు. 

మోహన్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఇంతవరకు లక్ష్మమ్మను బయట ప్రపంచానికి పరిచయం చేసింది లేదు. ఆమె తిరుపతి శ్రీవిద్యా నికేతన్ లోనే ఉండేవారట. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మమ్మ ఈరోజు ఉదయం అనంతలోకాలకు వెళ్లారు.    Related Post

సినిమా స‌మీక్ష