రాశి ఖన్నా అక్కడకి జంప్

September 11, 2018


img

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిన రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత అమ్మడు వరుస అవకాశాలతో స్టార్ హీరోల పక్కన ఛాన్సులు పట్టేస్తుంది. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ అయినా అంతకుముందు వచ్చిన తొలిప్రేమ హిట్ కొట్టింది. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్నా సరే కోలీవుడ్ కు జంప్ అయ్యింది.

తమిళంలో రాశికి పాపులారిటీ పెరిగింది. అక్కడ ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే రాశి చేతిలో వరుసగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి అయ్యేదాకా తెలుగు సినిమాలు చేసే అవకాశం లేదు. తెలుగులో హిట్లు కొట్టినా సడెన్ గా అమ్మడు ఇక్కడ ఖాళీ అయ్యి అక్కడ ఫుల్ బిజీగా మారింది. తమిళంలో కమిట్ అయిన సినిమాలన్ని పూర్తి చేసి కాని మళ్లీ తెలుగు సినిమాలు చేస్తా అంటుంది రాశి ఖన్నా. మరి అది ఎప్పటికి అవుతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష