వెంకటేష్.. సూర్య.. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్..!

August 17, 2018


img

గురు తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో సినిమాలు చేస్తున్న వెంకటేష్ త్వరలో నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాలో వెంకటేష్ తో పాటుగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమా కథ సిద్ధం చేశారట. నేను లోకల్ హిట్ అవడంతో త్రినాధరావుతో దిల్ రాజు హలో గురు ప్రేమ కోసమే సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత వెంకటేష్ సినిమా మొదలవుతుందట. ఈ సినిమాలో సూర్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో నటిస్తారని తెలుస్తుంది. దాదాపు 20 నిమిషాల దాకా సూర్య రోల్ ఉంటుందని తెలుస్తుంది. తమిళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన సూర్య ఈ సినిమా ఒప్పుకుంటే డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. కార్తి మాత్రం ఊపిరితో ఆ ఫీట్ చేసి మెప్పించాడు. మరి సూర్య, వెంకీ కాంబినేషన్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష