నానికి ఆల్టర్నేట్ గా మారాడు..!

August 17, 2018


img

అష్టా చమ్మతో హీరోగా పరిచయమై నాచురల్ నటనతో నాచురల్ స్టార్ గా మారిన నాని ఈమధ్య మంచి ఫాంలో ఉన్నాడు. ఎవడే సుబ్రమణ్యం నుండి ఎం.సి.ఏ వరకు 6 సూపర్ హిట్లు కొట్టిన నాని లేటెస్ట్ గా వచ్చిన కృష్ణార్జున యుద్ధం మాత్రం నిరాశపరచింది. మళ్లీ నాగార్జునతో చేస్తున్న దేవదాస్ తో ఫాంలోకి రావాలని చూస్తున్న నానికి మరో హీరో ఆల్టర్నేట్ గా మారడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.   

అతనెవరో కాదు విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని పక్కన నటించిన విజయ్ ఆ తర్వాత పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన గీతా గోవిందం మూవీ కూడా విజయ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది. ఈ సినిమా కథ ముందు పరశురాం నానికే చెప్పాడని తెలుస్తుంది.  

సో నానికి పర్ఫెక్ట్ ఆల్టర్నేట్ గా విజయ్ మారాడని గీతా గోవిందం ఫలితం చూసి చెప్పొచ్చు. నాని, విజయ్ మంచి ఫ్రెండ్స్.. మరి ఇద్దరికి ఇలాంటి క్లాష్ రావడం ఫ్యూచర్ లో కచ్చితంగా వారి రిలేషన్ మీద దెబ్బవేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష