కొత్త కొత్తగా సుధీర్ బాబు..!

August 16, 2018


img

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సుధీర్ బాబు తెలుగులో యువ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన సమ్మోహనం సినిమాతో హీరోగా మరో లెవల్ కు వెళ్లిన సుధీర్ బాబు ప్రస్తుతం తన ఓన్ ప్రొడక్షన్ లో నన్ను దోచుకుందువటే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అవకముందే మరో సినిమా లైన్ లో పెట్టాడు సుధీర్ బాబు.

ఇక సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్న సుధీర్ కథ కథనాలు కూడా కొత్తగా ఉండేలా చూస్తున్నాడు. నన్ను దోచుకుందువటే సినిమా ఆరెస్ నాయుడు డైరెక్ట్ చేస్తుండగా ఇప్పుడు మరో నూతన దర్శకుడు పులి వాసుతో సుధీర్ ఈ సినిమా చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ను సెలెక్ట్ చేశారట. త్వరలో మొదలవనున్న ఈ సినిమా కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష