గీతా గోవిందంపై రాజమౌళి ప్రశంసలు..!

August 16, 2018


img

పరశురాం డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా బన్ని వాసు నిర్మించారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా సినిమాపై రాజమౌళి రెస్పాన్స్ అందించడం జరిగింది. సినిమా చూసిన జక్కన్న సినిమా అంతా సరదాగా సాగిందని.. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు మంచి చాయిస్ అని.. విజయ్ తను ఏం చేస్తున్నాడో అవగాహనతో చేస్తున్నాడని అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటైల్డ్ గా చెప్పారని.. దర్శకుడు పరశురాం బాగా హ్యాండిల్ చేశారని అని రాజమౌళి ట్వీట్ చేశారు.

రాజమౌళి ట్వీట్ తో చిత్రయూనిట్ కు మరింత ఉత్సాహం వచ్చింది. రాజమౌళి ట్వీట్ కు రెస్పాన్స్ గా సర్ మీ దగ్గరనుండి ప్రశంసలు అందుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నా.. మీరు సినిమాను ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉందని థ్యాక్యూ వెరీ మచ్ అంటూ రిప్లై ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కూడా సార్ మీరు ఎంజాయ్ చేశామని చెప్పడం మాకు సూపర్ హ్యాపీ అని.. మీ వద్ద నుండి లభించే అభినందనలు ప్రత్యేకమైనవని ట్వీట్ చేశాడు. 



Related Post

సినిమా స‌మీక్ష