అరవింద సమేత టీజర్.. కంటబడ్డావా..!

August 15, 2018


img

ఎన్నాళ్ల నుండో నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అరవింద సమేత టీజర్ రానే వచ్చింది. త్రివిక్రం మార్క్ తో ఎన్.టి.ఆర్ స్టామినా చూపించేలా వీర రాఘవ వీరరసం ఉందని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ లాంటి నటుడు మాటల మాంత్రికుడి చేతిలో పడితే అచ్చం అలానే అరవింద సమేత టీజర్ ఉంది. ఇక టీజర్ లో డైలాగ్ కంట బడ్డావా.. కనికరిస్తా.. వెంటపడ్డావా అంటూ తారక్ చెప్ప్పే డైలాగ్ దుమ్ముదులిపేసింది.

నందమూరి ఫ్యాన్స్ కు మరోసారి దసరాకి ముందే పండుగ వచ్చేలా చేసేలా అరవింద సమేత వస్తుంది. హారిక హాసిని క్రియేషస్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ లో ఎన్.టి.ఆర్ స్టన్నింగ్ లుక్ అదిరిపోయింది. టీజర్ తో సినిమా మరింత అంచనాలను పెంచింది. అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.    


Related Post

సినిమా స‌మీక్ష