ఈసారి విజయ్ కు జోడిగా..!

August 14, 2018


img

గీతా గోవిందంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో యూత్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అందుకే రిలీజ్ అవుతున్న గీతా గోవిందం సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ హీరోల సినిమాల్లానే అదిరిపోతున్నాయి. పరశురాం డైరెక్ట్ చేసిన గీతా గోవిందంలో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమాతో పాటుగా విజయ్ చేసిన టాక్సీవాలా రిలీజ్ ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం తమిళంలో నోటా మూవీతో పాటుగా తెలుగులో డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా ఉంటుందట. కె. ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. స్టార్స్ సరసన నటిస్తున్న రాశి ఖన్నా యువ హీరోలతో కూడా జోడీ కడుతుంది. రాశితో విజౌ రొమాన్స్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష