చరణ్ అతనితో ఫిక్స్..!

August 13, 2018


img

సక్సెస్ ఫుల్ డైరక్టర్ వంశీ పైడిపల్లి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని తెలుస్తుంది. రంగస్థలం తర్వాత రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా ఎన్.టి.ఆర్ తో పాటుగా చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఆ తర్వాత సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందట. బోయపాటి సినిమా ఓకే కాని రాజమౌళితో సినిమా అంటే సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సిందే. మరి జక్కన్న సినిమా తర్వాత వంశీతో మూవీ ఫిక్స్ అయిన రాం చరణ్ ఆ సినిమాకు ఎప్పుడు ఫ్రీ అవుతాడో చూడాలి. ఈ ఇద్దరు కలిసి ఆల్రెడీ ఎవడు సినిమా చేశారు. ఈసారి వంశీ చరణ్ ఇద్దరు కలిసి ఎలాంటి మూవీ చేస్తారో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష