తేజూ కిశోర్ ట్రయాంగిల్ లవ్..!

August 13, 2018


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తేజ్ ఐలవ్యూ కూడా ఫ్లాప్ అవడంతో కెరియర్ లో మరింత వెనకపడ్డాడు. ప్రస్తుతం అమెరికాకు తన లుక్ చేంజ్ చేసుకునేందుకు వెళ్లిన తేజ్ త్వరలోనే కిశోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమా టైటిల్ గా చిత్రలహరి అని ప్రచారంలో ఉంది. సినిమా సినిమా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. 

అంతేకాదు ఇదో లవ్ స్టోరీ అని కూడా తెలుస్తుంది. చిత్ర, లహరి ఇద్దరు అమ్మాయిల మధ్య హీరో నడిపే ప్రేమకథే ఈ చిత్రలహరి సినిమా కథని అంటున్నారు. సినిమాలో ఒక హీరోయిన్ గా నివేదా థామస్ సెలెక్ట్ అయ్యిందట. మరో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా కూడా ఈ సినిమా కథ ఉంటుందట. నేను శైలజ హిట్ తర్వాత కిశోర్ తిరుమల చేసిన ఉన్నది ఒకటే జిందగి సినిమా నిరాశపరచినా ఈసారి కిశోర్ చిత్రలహరితో పక్కా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. మరి తేజ్ కు ఈసారైనా కిశోర్ ద్వారా హిట్ వస్తుందేమో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష