పాపం బాబు గోగినేని..!

August 13, 2018


img

బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా ఎంపికకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అన్నది పక్కాగా రూలేమి లేదు. సెలబ్రిటీ అయ్యుండాలి లేదా ఫేమస్ ఫిగర్ అయ్యుండాలి. అయితే బిగ్ బాస్ ఈ సెకండ్ సీజన్ కు కామన్ మెన్ కు ఛాన్స్ ఇచ్చారు. నూతన్, గణేష్ లు బిగ్ బాస్ 2కి ఎంపిక అయ్యారు. ఇదిలా ఉంటే హౌజ్ లో ప్రముఖ హేతువాది బాబు గోగినేని కూడా ఉన్నారు. ఆయనని బిగ్గర్ బాస్ అంటూ హౌజ్ మెట్స్ పిలుస్తారు.

హౌజ్ లో అందరితో సరదాగా ఉండే ఆయన కౌశల్ కు మాత్రం ఎగైనెస్ట్.. అదే ఆయన్ను హౌజ్ నుండి బయటకు వచ్చేలా చేసింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ అంతా ఓటింగ్ సిస్టెమే. కౌశల్ కు బయట ఆర్మీ ఒకటి ఏర్పడింది. హౌజ్ లో అందరు ఒక రూట్ లోకి వెళ్తే కౌశల్ మరో రూట్ లోకి వెళ్తాడు. అందుకే ఆడియెన్స్ అందరికి అతనే హాట్ ఫేవరేట్ అయ్యాడు. బాబు, కౌశల్ ఫైట్ ముదరగా ఈసారి నామినేట్ అయితే బాబుని ఖచ్చితంగా కౌశల్ ఆర్మీ టార్గెట్ చేస్తుందని అనుకున్నారు.  

అనుకున్నట్టుగానే ఈవారం నామినేషన్ లో ఉన్న బాబు నిన్న హౌజ్ నుండి బయటకు వచ్చేశాడు. కేవలం కౌశల్ ఆర్మీ వల్లే బాబు గోగినేని బయటకు వచ్చాడు అని చెప్పలేం కాని బాబు ఎలిమినేషన్ లో వారి హ్యాండ్ ఉంది అన్నది ఓపెన్ టాక్. కౌశల్ తో పెట్టుకున్న వారెవరైనా ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అనే టాక్ ఉంది. అలానే భాను నుండి కిరీటి, బాబు వరకు జరుగుతూ వస్తుంది. మరి ఈ సీజన్ ఒక కంటెస్టంట్ చేతిలోకి వెళ్లడం ఆలోచించాల్సిన విషయమే అయినా కరెక్ట్ టైం దొరికితే కౌశల్ ను బ్యాడ్ చేసేందుకు బిగ్ బాస్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష